ప్రకృతితో_మళ్ళీ_కలిసి_జీవిద్దాం !-రావి
మనం బ్రతకడానికి కావాల్సిన వాటిలో... తిండి నీరు లేకపోయినా... కొన్ని రోజుల పాటు బ్రతకగలం కానీ,
గాలి లేకపోతే క్షణం కూడా బ్రతకలేమని మనందరికీ తెలుసు.
గాలంటే.... ఆక్సిజనే మన దృష్టిలో !
ప్రస్తుత విషమ కాలంలో ఆక్సిజన్ అందక అనేకమంది చనిపోతున్నారనే వార్తలు వింటున్నాం.
కొంతమందికి ఆ ఆక్సిజన్ అందించి
ప్రాణాలు నిలబెట్టడం కోసం వేలు, లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది !
మనం చెల్లించిన పన్నుల్లోంచి...
ప్రభుత్వం కోట్ల రూపాయలు కుమ్మరించి.. యుద్ధ విమానాల్లో
విదేశాల నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు నేరుగా సరఫరా చేస్తోంది.
వార్తల్లో.. ప్రధాన శీర్షికకు
చేరింది ఆక్సిజన్ !
ఈ రోజున ఆక్సిజన్ అందించిన
వారే మనకు దేవుడు !
అటువంటి ఆక్సిజన్ ను
అడక్కుండానే, ఉచితంగా
టన్నుల కొద్దీ...
అందిస్తుంది రావి చెట్టు !
ఆకురాలు కాలమైన
శిశిర ఋతువు నుంచి
కొత్త చివుళ్ళు వేసే
వసంత ఋతువు లోకి ప్రవేశించే టప్పుడు... రావి చెట్టును చూస్తే..
అచ్చం మన ఊపిరితిత్తుల్లా కనిపించడం ప్రకృతి వైచిత్రి !
రావి వేప చెట్లు రెండింటి
నుంచీ విడుదలైన గాలులు
కలగలిసి...
ఔషధం గా పని చేస్తాయి.
అందుకే..
శారీరక హార్మోన్ల సమతుల్యత లోపంతో పిల్లలు పుట్టని వారికి...
రావి, వేప కలిసి ఉన్న ప్రాంతంలో ప్రదక్షిణలు చేస్తారు..
ఒక దీక్ష గా ! అంటే మండలం రోజులని ( 41 రోజులు )
అర్థమండలం రోజులని
( 21 రోజులు )
అలా.. వారు ఆ ప్రదక్షిణలు చేసే సమయంలో... ఈ గాలిని పీల్చడం ద్వారా..... శరీరంలో క్రమేణా దోషాలు, లోపాలు, రోగాలు తొలగి... సంతానం కలగడానికి మార్గం సుగమమౌతుంది.
అలా కొన్ని శతాబ్దాల నుంచి మన పూర్వీకులీ నమ్మకం... శాస్త్రీయమేనని ఋజువు చేశారు. ఇప్పటికీ పాటిస్తున్నారు. ఫలితాలు పొందుతున్నారు.
అంతేనా.. ! రావి చెట్టు కాండం హోమంలో వాడటానికి పరమ శ్రేష్ఠం !
హోమంలో హుతమై... దాని నుండి వెలువడే గాలి ఓషధిలా పనిచేస్తుంది.
మన దేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్న కు ఇచ్చే
జ్ఞాపికకు రావి ఆకు ఆధారం !
బుద్ధుడు రావి చెట్టు క్రిందే జ్ఞానోదయం పొందారు. బోధి వృక్షం ఇప్పటికీ.. పరమ పూజనీయ స్థలంగా దర్శిస్తున్నాం.
హైందవాన్ని నిరసిస్తూ... బౌద్ధాన్ని ఉద్దేశ్య పూర్వకంగా ప్రమోట్ చేస్తున్న వారు కూడా రావి చెట్టును పూజించడం.. మూర్ఖత్వమని హేళన చేయడంలోనే వారి ఆత్మవంచన
బయటపడుతుంది !
రావి చెట్టు వల్ల లాభాలేంటి
అని ప్రశ్నించే వారికి,
ఆ చెట్టును పూజించడం ఒక మూఢనమ్మకమనే వారికి....
వారి కళ్ళెదుటే...
విశ్వరూప సందర్శన మిస్తూ నిలబడింది రావి చెట్టు !
ఇలా రావి చెట్టు గురించి
చెప్పుకోవడానికి చాలా వుంది !
ప్రస్తుత ఆధునిక కాలంలో క్రమేణా.... ప్రకృతికి దూరమౌతున్న వేళ...
మళ్ళీ మనకా సుసంపన్నమైన జీవనాన్ని ప్రసాదించే వరదాయిని రావి చెట్టు.... !
ఇప్పుడే... మన చుట్టు పక్కల..
ఎక్కడైనా... ఖాళీ ప్రదేశం వెదికి వీలైతే
ఖాళీ చేసి... మరీ ఒక రావి మొక్కను నాటుదాం !
సంపూర్ణ ప్రాణవాయువుని టన్నుల కొద్దీ ఉచితంగా అందుకుందాం !
********
Comments
Post a Comment