ప్రకృతితో_మళ్ళీ_కలిసి_జీవిద్దాం !

 



                                                  AMARENDRA VALIVETI

వేపమండలు....
మన సినిమాల్లో భూత వైద్యులు 
చేతుల్లో ఊగిపోతుంటాయ్ !
ఏ మూఢ నమ్మకాన్ని ప్రదర్శించాలన్నా..
మేధావులు ఎంచుకున్న సింబల్
వేప...
అలా... మన‌ మెదళ్ళలోకి...
వేప.. ఒక మూఢనమ్మకంగా స్థిరపడింది. 
నిజానికి అలా.... నిజమైన మూఢనమ్మకం తిష్ట వేసింది.
దెయ్యంలా పట్టింది.
విచిత్రంగా...
మనకు పట్టిన
ఈ దెయ్యాన్ని 
అమెరికా పేటెంట్ వ్యూహం
వదిలించింది.
అదెలాగంటే, 
సుమారు 1970 ప్రాంతాల్లో..
ఆధునిక పరిశ్రమలన్నీ..
రాయల్టీలు, పేటెంట్లు...
అంటే మేధోసంపత్తి హక్కుల్లో ఇరుక్కుపోతున్నాయని అమెరికా గుర్తించింది.
అప్పటికే ఉన్న పేటెంట్ల వ్యూహాన్ని
మరింత కట్టుదిట్టంగా అమలు చేయసాగింది.
దీనికి తోడు బయో టెక్నాలజీ
ఆవిర్భావం మరింత వేగంగా పేటెంట్ల ను కంపెనీలకు అందించడం ప్రారంభమయ్యింది.
సరిగ్గా ఇక్కడే... మన ఆయుర్వేదం, మూలికా వైద్యం, సిద్ధ వైద్యం మొదలైన వాటిపై పాశ్చాత్య కంపెనీల
దృష్టి పడింది.
ఇప్పటి ఆధునిక శాస్త్రీయ పరిశోధనల ద్వారా ఋజువు కాని ఎన్నో ఖచ్చితమైన వైద్య ఔషధాలు
మన ఆయుర్వేద శాస్త్రాలలో ఉన్నాయి. అలాంటి వాటిలో
వేపలోని " అజారిడిక్టన్ " అనే క్రిమిసంహారిణి మూలకాన్ని 
గుర్తించి అమెరికా కంపెనీ 
మోన్ శాంటో పేటెంట్ పొందింది‌.
వందన శివ గారు 
నవధాన్య పేరుతో... 
సహజ వ్యవసాయం ద్వారా విత్తనాలను సేకరించి, భద్ర పరుస్తున్న
స్వదేశీ పర్యావరణ వేత్త !
ఆమె... వేపపై
మోన్ శాంటో పొందిన పేటెంట్ పై
అంతర్జాతీయ న్యాయస్థానంలో వ్యాజ్యం వేసారు.
విస్పష్ట ఆధారాలతో...
అనాది కాలం నుంచీ
మనదేశంలో.. వేపను క్రిమిసంహారిణి గా వాడుతున్నామని, పేటెంట్ పొందే హక్కు ఆ కంపెనీకి లేనేలేదని ఋజువు చేసి, గ్లోబల్ లెజెండ్ కంపెనీ
మోన్ శాంటో పొందిన పేటెంట్ ను కాన్సిల్ చేయించారు.
సింగిల్ హాండ్ తో.. 
అంతర్జాతీయ మాఫియాని 
ఎదుర్కొని నిలిచి గెలిచారామె !
అలా ఆమె... 
వేప ఉన్నంత కాలం..
చరిత్ర ఆమెను గుర్తు పెట్టుకుంటుంది.
మనం ఆమెకు ఋణపడి ఉంటాము.
మనకు అంతగా పరిచయం లేని ఆమె చిత్రాన్ని కూడా ఇక్కడిస్తున్నాను.
దీంతో నైనా... మనం కళ్ళు తెరవాల్సింది. తెరవనివ్వలేదు మన విదేశీ బానిస స్వదేశీ ప్రభుత్వాలు !
కీ.శే. వాజపేయి గారి హయాంలో..
మురళీ మనోహర్ జోషి గారు...
మన విజ్ఞానాన్ని డిజిటలైజ్ చేసి, పేటెంట్లు పొందటం కోసం ఒక ప్రాజెక్టు చేపట్టారు.
తదనంతర మన్మోహనుని హయాంలో దాన్ని మూలన పడేశారు.
ఇదీ వేప ఘనతకు చెందిన తాజా చరిత్ర
ఇక మన మూలాల్లోకి వెళదాం.
**********
కోరినవల్లా ఇచ్చే
కామధేనువు, 
కల్పవృక్షం.... 
వేరెక్కడో లేవు.... !
ఇక్కడే... ఈ భూమ్మీదే...
మనతోటే... మన పక్కనే...
ఉన్నాయి.
కామధేనువు... గోమాత అయితే...
కల్పవృక్షం.... వేప...
అదెలానో చూద్దాం !
మన ఇంటితో... ఒక అవిభాజ్యమైన ప్రకృతి సంపదలో వేప ప్రాధాన్యత మరువలేనిది.
అంటువ్యాధుల నిర్మూలనకు... ఆలంబన... వేప...
అందుకే.... యుగాది రోజున
మనం తీసుకునే పచ్చడిలో 
వేప పూత ఉంటుంది.
ఈ వసంత కాలంలోనే ప్రతి చెట్టూ... 
చివుళ్ళు వేస్తాయని మనందరికీ తెలుసు కదా !
సాధారణంగా... ఆ యుగాదితోనే మొదలయ్యే వేసవి కాలంలో... ఆటలమ్మ, తడపర మొదలైన అంటువ్యాధులు వచ్చే సమయం.... 
అలానే... 
వేసవి కాలం వెళ్ళి వర్షాకాలం 
వచ్చే సమయంలో మరికొన్ని అంటువ్యాధులు వస్తాయి.
వీటిని నిరోధించడానికే..
మన వాళ్ళు గ్రామ దేవతలు...
పోలేరమ్మ మొదలైన దేవతలకు
కొలుపులు కొలుస్తారు...
ఈ కొలుపుల్లో... వేప, పసుపు లకే
ప్రధమ ప్రాధాన్యం.
కారణం.... ఈ రెండూ..
బయో యాంటీ వైరల్...
బయో యాంటీ బాక్టీరియల్,
బయో యాంటీ సెప్టిక్...
బయో అంటే సహజమైన అని అర్థం.
మన ప్రాణాలు తీయడానికి ఒక్క దోమ చాలు అని ఇటీవల వరకు... అంటే ఈ మహమ్మారి రావడానికి ముందు వరకు... డెంగీ చికెన్ గున్యాల కాలంలో చెప్పుకున్న మాట.
ఆ దోమల నివారణ, నిర్మూలనలో...
సహజ క్రిమి కీటక నాశిని గా ఈ వేప అత్యద్భుతంగా పని చేస్తుందని మనందరికీ తెలిసిన విషయమే !
వేపాకుతో వేసిన పొగతో దోమలు పరార్ !
అలానే వేప నూనె చేతులకు కాళ్ళకు రాసుకుంటే... కూడా దోమలు మన దరికి చేరవు !
వ్యవసాయంలో వేప నూనెను సహజ క్రిమిసంహారిణి గా విరివిగా వాడేవాళ్ళు !
మన గొడ్లను, ఆవులను కూడా ఈ వేపాకుతో వేసిన పొగ, నూనె తోనే 
దోమల నుంచి రక్షించుకుంటాం.
పొద్దన్నే లేవగానే పళ్ళుతోముకోవడానికి వేపపుల్లనే
ఇప్పటికీ చాలా గ్రామాల్లో వాడుతున్నారు మన వాళ్ళు‌ !
ఇళ్ళ తలుపులు, కిటికీలకు కావాల్సిన కలపగా వేప కర్రను వాడితే చెదలు దరిచేరవు ! పైగా దాని నుంచి వెలువడే వాయువులు ఇంట్లో‌ అందరం పీల్చుకుంటాం. 
ఆరోగ్యంగా ఉంటాం.
పెళ్ళి కాని వారు, పిల్లలు పుట్టని వారు
వేప, రావి కలిసి ఉన్న పవిత్ర ప్రదేశానికి ప్రదక్షిణలు చేస్తున్నారు.
సత్ఫలితాలు పొందుతున్నారు.
ఇలా ఉదయం లేచిన దగ్గర్నుంచి పడుకోబోయే ముందు వరకు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగ పడుతుంది కాబట్టి, అంటువ్యాధులకు అడ్డుగోడగా నిలుస్తుంది కాబట్టే వేప మనకు కల్పవృక్షం.
**********
ప్రపంచమంతా గుర్తించిన మన వేపను మనం తిరిగి గుర్తించి‌ అక్కున చేర్చుకుందాం !
మనం.. మన తర్వాతి తరాలకు
బంగారు భవిష్యత్తు నిద్దాం !

Comments

Popular posts from this blog

ప్రకృతితో_కలిసి_మళ్ళీ_జీవిద్దాం -కొబ్బరి

సీతా నవమి