Posts

Showing posts from May, 2025

మనకాలపు మహాద్రష్ట వీర్ సావర్కర్!

Image
  మనకి కనిపించడంలేదూ అంటే మనకన్ను చూడలేకపోతోందని అర్ధం!   లేదని కాదు! కృష్ణుడు చెప్పిన ధర్మం మతం కాదు. మన జీవితం! గీతతో కోట్లమందికి దారి చూపించిన అతనికన్నా గురువెవ్వరు? రక్షణకోసం సముద్రం మధ్యలో ద్వారక నిర్మించిన అతనికన్న గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు? చూపుతోనే మనసులోని మాట చెప్పే అతనికన్న గొప్ప సైకాలజిస్ట్ ఎవరు? వేణుగానంతోనే గోవుల్ని గోపికల్ని కట్టిపడేసిన అతనికి మించిన   మ్యూజీషియన్ ఎవరు? నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టరెవరు? ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతనికి మించిన వీరుడెవ్వరు? కరవు కష్టం తెలియకుండా చూసుకున్న అతనికి మించిన రాజెవ్వడు? హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్ధం చేసుకున్న గొప్ప క్లైమేటాలజిస్ట్ ఎవరు? అన్ కంట్రోలబుల్ ఆర్పీఎమ్(RPM) తో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్   చేసే అతనికి మించిన కైనెటిక్ ఇంజినీర్ ఎవరు? అతనొక ఫైటర్ (Fighter) సింగర్(Singer) టీచర్ (Teacher)వారియర్(Worrier)   what not? he is everything! His Aura is eternal. He is more than God to me. I   worship His Excellence!  ...

టచ్‌ తోనే జీవితం, కానీ ఎవరు ఎవరితో టచ్‌లో లేరు.

Image
 ఇది గడియారాన్ని తినేసింది ఇది టార్చ్ లైట్‌ను తినేసింది ఇది పోస్టు కార్డుల్ని తినేసింది ఇది పుస్తకాల్ని తినేసింది ఇది రేడియోను మింగేసింది ఇది టేప్‌రికార్డర్‌ను తినేసింది ఇది కెమెరాను మాయం చేసింది ఇది కాలిక్యులేటర్‌ను తినేసింది ఇది ఇరుగు పొరుగుతో దోస్తీ తినేసింది ఇది బంధుత్వాల్ని తినేసింది ఇది మన మెమొరీని తినేసింది చివరికి థియేటర్ లేదు నాటకం లేదు, 14.  టీవీ లేదు,  15.ఆట లేదు,  16.పాట లేదు.  ఆఖరికి  17.ఇదే బ్యాంకు,  18.ఇదే హోటల్,  19.ఇదే కిరాణ షాపు  20.ఇదే డాక్టర్,  21.ఇదే జ్యోతిష్కుడు 22.అసలు మార్కెట్ అంటేనే ఇది. 23.అంతా వర్క్ ఫ్రమ్ ఫోనే  మనిషి పిచ్చోడవుతుంటే,  ఫోన్ మాత్రం  రోజురోజుకి స్మార్ట్‌గా మారుతోంది.  చిటికెన వేలు మనిషి జీవితాన్నే కాదు  మొత్తం ప్రపంచాన్నే శాసిస్తోంది... టచ్‌ తోనే జీవితం,  కానీ ఎవరు ఎవరితో  టచ్‌లో లేరు.!! వాట్సప్ సేకరణ by AMARENDRA VALIVETI

ఉద్యోగ నైపుణ్యాలు - నాన్న శిక్షణ

Image
AMARENDRA VALIVETI  "రూమ్ లో నుండి వెళ్ళేటప్పుడు ఫ్యాన్  ఆపాలని తెలీదా..?"  కరకుగా ఉన్న నాన్న గొంతు విని.. స్విచ్చాఫ్ చేసి వచ్చా. "డ్రాయింగ్ రూమ్ లో ఎవరూ లేకపోతే టీవీ దేనికి.. అది కూడా ఆఫ్ చేయమని చెప్పాలా ప్రత్యేకంగా..?" మళ్ళీ అదే గొంతు. విసురుగా టీవీ ఆఫ్ చేసి టేబుల్ పై  ఉన్న ఫైల్ తీసుకుని.. బైటకి నడిచా.. ఎందుకిలా అవుతున్నాడు నాన్న.. ప్రతిదానికి కోప్పడటం,చిరాకు.,అసహనం... ఇంత చిన్న విషయాలక్కూడా పెద్దగా అరవడం. తానే ఫ్యాన్,టీవీ స్విచ్చాఫ్ చేయొచ్చుగా.. నన్నే పురామయించడం దేనికి.. చాదస్తం ఎక్కువౌతుంది ఈమధ్య. ఇక నా వల్ల కాదు ఈ అసహనం భరించడం.. ఎలా అయినా ఇల్లు వదిలి పోవాల్సిందే.. ఈయన గారి బాధ నుండి విముక్తి పొందాల్సిందే. ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉంది.. లేటౌతున్నా అనే ఇంగితజ్ఞానం కూడా  లేకుండా తిట్టి పోస్తున్నాడు.. దేవుడా.. ఎలాగైనా ఈ ఉద్యోగం వచ్చేటట్లు చూడు.. ఎలాగోలా ఇంటి నుండి బైటపడాలి. లేపోతే ఇంకా నాన్న విసుగు, కోపం,చిరాకు ఇంకొన్నాళ్లు భరిస్తే...... పిచ్చెక్కక తప్పదు. మనసులో ఫ్రస్ట్రేషన్ తన్నుకొచ్చేస్తుంది నాకు. అంతలా టార్చర్ చేస్తున్నాడు నాన్న. సంపాదన లేదు. ఇల్లు వదిలి బైట...

భావాలు - వాటి మూలాలు !

Image
                                మనం తరుచుగా వినే కొన్ని సంస్కృతవాక్యాల మూలాలు తెలుసుకోవాలని అనిపించడం సహజం కదా. అలాంటి వాటిని కొన్నింటిని మీకోసం సిద్ధం చేశాను చూడండి: ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ:  👉 ధర్మో రక్షతి రక్షిత: 👉 సత్య మేవ జయతే 👉 అహింసా పరమో2ధర్మ: 👉 ధనం మూలమిదం జగత్ 👉 జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి 👉 కృషితో నాస్తి దుర్భిక్షమ్ 👉 బ్రాహ్మణానా మనేకత్వం 👉 *యథా రాజా తథా ప్రమేషుఓ 👉 పుస్తకం వనితా విత్తం  పర హస్తం గతం గత: 👉 శత శ్లోకేన పండిత: 👉 శతం విహాయ భోక్తవ్యం 👉 అతి సర్వత్ర వర్జయేత్ 👉 బుద్ధి: కర్మానుసారిణీ 👉 వినాశ కాలే విపరీత బుద్ధి: 👉 భార్యా రూప వతీ శత్రు: 👉 స్త్రీ బుద్ధి: ప్రళయాంతక: 👉 వృద్ధ నారీ పతి వ్రతా 👉 అతి వినయం ధూర్త లక్షణమ్ 👉 ఆలస్యం అమృతం విషమ్ 👉 దండం దశ గుణం భవేత్ 👉 ఇవీ మన చెవిని పడుతూ ఉండే మూల వాక్యాలు. కదా? ఇప్పుడు వీటి పూర్తి పాఠాలు చూదామా ? ధర్మ ఏవో హతో హంతి ధర్మో రక్షతి రక్షిత: తస్మా ధర్మో న హంతవ్యో మానో ధర్మో హ్రతోవ్రధీత్  🔥ధర్మాన్ని మ...

సోషల్ మీడియాలో బంగారు రేణువులు

Image
                   పసిడిని వెలికితీయడం అంటే..... చెప్పుకున్నంత సులభం కాదు. కొనుక్కున్నంత ఆనందం కాదు. ధరించినంత హుందాగా ఉండదు. సగటున వందకోట్ల మట్టి రేణువుల్లో మూడంటే మూడు బంగారు రేణువులుంటాయి. వెయ్యికిలోల మట్టినితోడి శుద్ధిచేస్తేగానీ అందులోంచి 0.5 గ్రాముల బంగారం బయటపడదు.  అంతకన్నా తక్కువ దొరికితే ఇక ఆ గనితో పనిలేనట్లే. ఇప్పుడీ బంగారం కత ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే…  ********************* ప్రస్తుతం మనవన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీలు. అంటే చిన్న కుటుంబాలు. చిన్న కుటుంబాలు చింతలేని కుటుంబాలనీ మన పూర్వప్రభుత్వాలు ఇల్లెక్కి అదే పనిగా కూసి, మన మనసుల్లోకి బహుసంతానం పైనా, ఉమ్మడికుటుంబాలపైనా విముఖతను సైలెంట్ గా ఇంజెక్ట్ చేశాయి. ఫలితంగా, మానవ సంబంధాలంటే ఏమిటోకూడా తెలియని వింతతరాలు పెరిగి పెద్దవై మనముందు జడపదార్దాల్లా తిరుగుతూ, మనమెంతటి తెలివితక్కువ దద్దమ్మలమో అద్దంలాగ చూపిస్తూ వెక్కిరిస్తున్నాయి. ఈ మానవరోబోలకు తాతయ్యలూ, అమ్ముమ్మలూ, నానమ్మలూ, మామయ్యలూ, అత్తయ్యలూ, అన్నయ్యలూ, అక్కయ్యలూ,తమ్ముళ్లూ,చెల్లెళ్ళూ,బావలూ,మరదళ్ళూ ఎవరితోనూ హృదయ పూర్వ క అను...

ప్రకృతితో_మళ్ళీ_కలిసి_జీవిద్దాం !-రావి‌

Image
  మనం బ్రతకడానికి కావాల్సిన వాటిలో ... తిండి నీరు లేకపోయినా ... కొన్ని రోజుల పాటు బ్రతకగలం కానీ , గాలి లేకపోతే క్షణం కూడా బ్రతకలేమని మనందరికీ తెలుసు . గాలంటే .... ఆక్సిజనే మన దృష్టిలో ‌ !   ప్రస్తుత విషమ కాలంలో ‌ ఆక్సిజన్ అందక అనేకమంది చనిపోతున్నారనే వార్తలు వింటున్నాం .   కొంతమందికి ‌ ఆ ఆక్సిజన్ అందించి ప్రాణాలు నిలబెట్టడం కోసం వేలు , లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది !   మనం చెల్లించిన పన్నుల్లోంచి ... ప్రభుత్వం కోట్ల రూపాయలు కుమ్మరించి .. యుద్ధ విమానాల్లో విదేశాల నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు ‌ నేరుగా సరఫరా చేస్తోంది .   వార్తల్లో .. ప్రధాన శీర్షికకు చేరింది ఆక్సిజన్ !   ఈ రోజున ఆక్సిజన్ అందించిన వారే మనకు దేవుడు !   అటువంటి ఆక్సిజన్ ను అడక్కుండానే , ఉచితంగా టన్నుల కొద్దీ ... అందిస్తుంది ‌ రావి చెట్టు ‌ !   ఆకురాలు కాలమైన శిశిర ఋతువు నుంచి కొత్త చివుళ్ళు వేసే వసంత ఋతువు లోకి ప్రవేశించే టప్పుడు ... రావి చెట్టును చూస్తే .....