వసంతానికి రావడానికి ఎనిమిది ఋతువులు!-

జీవితమే ఓ కావ్యం , ప్రేమే దాని పద్యం ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో వచ్చిన "8 వసంతాలు " సినిమా ఓ కవితను తెరపైకి తీసుకువచ్చిన ప్రయత్నం . శుద్ధి అయోధ్య ( అనంతిక ) జీవితంలోని ఎనిమిది ఏళ్ల ప్రేమ , నోవు , నిరాశలు , తిరుగులేని నిర్ణయాలు – ఇవన్నీ ఓ సుడిగాలిలా తెరపై సాగుతాయి . ఈ ప్రయాణంలో ... " మనసు ముక్కలైనా , మృదుత్వం మాత్రం కరిగిపోని ఓ మహిళా హృదయం !" సాంకేతిక వైభవం : కళకు కన్నులు దొరికిన రోజు · కెమెరా : విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీలో ఒక్కో ఫ్రేమ్ ఓ చిత్రలేఖ . ఊటీ మంచు పర్వతాలు , బెనారస్ దీపాల నది , కాశ్మీర్ పువ్వుల వనాలు – ప్రతి దృశ్యం కళాఖండంలా మెరుస్తుంది . · సంగీత స్పర్శ : హేషం అబ్దుల్ వాహాబ్ సంగీతం ఆత్మను తాకే తీరు . " నువ్వే నా ఆకాశం " పాటలో వీణ వాయిద్యాలు , బౌల్స్ స్వరాలు ప్రేమను ధ్యానంగా మారుస్తాయి . · ...